‘శాకుంతలం’ రిలీజ్ డేట్ ఫిక్స్

స్టార్ హీరోయిన్ సమంత ప్రధాన పాత్రలో నటించిన అపురూప ప్రేమకావ్యం ‘శాకుంతలం’ రిలీజ్‌ డేట్‌ ఫిక్సయింది. నవంబర్‌ 4న ఈ చిత్రాన్ని ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నట్లు చిత్ర నిర్మాణ సంస్థలు గుణ టీమ్‌ వర్క్స్‌, శ్రీ వేంకటేశ్వర క్రియేషన్స్‌ అధికారికంగా ప్రకటించాయి.

మహాభారతం ఆదిపర్వంలోని శకుంతల, దుష్యంతుల ప్రేమకథని ఆధారంగా చేసుకుని ‘శాకుంతలం’ తెరకెక్కించారు గుణశేఖర్‌. శకుంతల పాత్రలో సమంత, దుష్యంతుడి పాత్రలో మలయాళీ నటుడు దేవ్‌ మోహన్‌ నటించారు. భారీ బడ్జెట్‌తో రూపుదిద్దుకున్న ఈచిత్రానికి గుణ శేఖర్‌ కుమార్తె నీలిమ నిర్మాతగా వ్యవహరించారు. అల్లు అర్జున్‌ కుమార్తె అర్హ ఈ సినిమాతో తెలుగు తెరకు పరిచయమవుతున్నారు.