‘గాడ్‌ ఫాదర్‌’ సెన్సార్ రిపోర్ట్

చిరంజీవి హీరోగా దర్శకుడు మోహన్‌రాజా తెరకెక్కిస్తున్న చిత్రం గాడ్ ఫ్దాదర్. దసరా కానుకగా అక్టోబర్ 5న ప్రేక్షకుల ముందుకు రానుంది. తాజాగా ఈ సినిమా సెన్సార్ కార్యక్రమాలను పూర్తి చేసుకుంది. యు/ఎ సర్టిఫికెట్ సొంతం చేసుకుంది. తాజాగా దీనికి సంబంధించిన పోస్టర్ ను చిత్ర బృందం షేర్ చేసింది.

మలయాళ చిత్రం ‘లూసీఫర్‌’కు రీమేక్‌గా గాడ్ ఫాదర్ తెరకెక్కింది.  సల్మాన్‌ఖాన్‌, నయనతార, సత్యదేవ్‌ కీలక పాత్రలు పోషిస్తున్నారు. ఈ సినిమాని రామ్‌ చరణ్‌, ఎన్‌. వి. ప్రసాద్‌, ఆర్‌. బి. చౌదరి సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ఈ పొలిటికల్ యాక్షన్ లో మెగా డైలాగ్స్ అదిరినున్నాయని సమాచారం.