పాక్ నటుడితో అమీషా డేటింగ్
బాలీవుడ్ సీనియర్ హీరోయిన్ అమీషా పటేల్ పాక్ నటుడు ఇమ్రాన్ అబ్బాస్ తో డేటింగ్ లో ఉన్నట్టు జోరుగా ప్రచారం జరుగుతోంది. వీరిద్దరు ఆప్యాయంగా కనిపిస్తున్న వీడియోను అమీషా తన ఇన్ స్టా లో పోస్ట్ చేయడం.. అది వైరల్ కావడంతో ఈ పుకార్లు పుట్టుకొచ్చాయి. అయితే ఈ వార్తలపై అమీషా స్పందించారు. అవన్నీ అవాస్తవాలేనని కొట్టిపారేశారు.
ఇమ్రాన్ అబ్బాస్ నాకు ఎంతో కాలం నుంచి తెలుసు. యూఎస్‌లో చదువుకుంటున్నప్పుడు పరిచయమయ్యాడు. అప్పటి నుంచి మేమిద్దరం స్నేహితులుగా ఉన్నాం. అతడు కూడా సినిమా పరిశ్రమకు చెందిన వ్యక్తే కావడంతో మేమిద్దరం తరచూ మాట్లాడుకునేవాళ్లం. ఇటీవల అతడిని కలిశా. ఆ సమయంలో సరదాగా ఓ ఇన్‌స్టా రీల్ చేశాం. వీడియో చూడ్డానికి బాగుందని నెట్టింట్లో షేర్ చేశా. ఇది సోషల్‌మీడియాలో వైరల్ కావడంతో.. మేమిద్దరం ప్రేమలో ఉన్నామని అనుకుంటున్నారని చెప్పుకొచ్చింది.