ట్రైలర్ టాక్ : ది ఘోస్ట్ – నరుకుడు కాల్చుడు

ప్రవీణ్ సత్తారు దర్శకత్వంలో కింగ్ నాగార్జున నటించిన చిత్రం ‘ది ఘోస్ట్’. సోనాల్ చౌహాన్ హీరోయిన్. ఈ స్పై యాక్ష‌న్ థ్రిల్ల‌ర్‌ ద‌స‌రా కానుక‌గా అక్టోబ‌ర్ 5న రిలీజ్ కానుంది.తాజాగా ఈ సినిమా ట్రైలర్ ను విడుదల చేశారు మేకర్స్. యాక్షన్ ప్యాక్డ్ గా ట్రైలర్ ను వదిలారు. గన్ లతో కాల్పులు లేదంటే కత్తులతో నరకడం ట్రైలర్ లో చూడొచ్చు. సింగిల్ డైలాగ్.. సింగిల్ రొమాన్స్ సీన్ తో స్పైసీగా కట్ చేశారు.

డబ్బు, సక్సెస్ సంతోషం కంటే శత్రువులనే ఎక్కువగా సంపాదిస్తుంది అని నాగ్ చెప్పిన డైలాగ్ బాగుంది. హెవీ యాక్షన్ సీన్ల మధ్య సోనాల్ చౌహాన్ తో రొమాన్స్ బిట్ కనిపించింది. బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ బాగుంది. ఈ సినిమాలో నాగార్జున త‌మ‌హాగానే పేరుతో ఓ ప్ర‌త్యేక‌మైన ఆయుధాన్ని వాడబోతున్నారు. ట్రైలర్ లో దాన్ని చూడొచ్చు. ఈ చిత్రానికి మార్క్ కె రాబిన్ సంగీతం. ఏషియన్ సునీల్, శరత్ మరార్, రామ్మోహనరావు నిర్మాతలు.

#TheGhost Trailer Out Now
➡️ https://t.co/48EiqczDcY#TheGhostTrailer #TheGhostOnOct5@iamnagarjuna @PraveenSattaru@sonalchauhan7 @SVCLLP@nseplofficial @SonyMusicSouth@iamMarkKRobin @bharattsaurabh #OTTRelease pic.twitter.com/vdwVADeDlg— OTTRelease (@ott_release) September 30, 2022