విక్కీ కౌశ‌ల్‌-సమంత.. ‘ఉరి’ దర్శకుడి సినిమా !

బాలీవుడ్ లో రాణించాలని ఆశ పడుతోంది సమంత. అందుకు తగ్గట్టుగానే ప్రణాఌకలు సిద్ధం చేసుకుంది. ఇందులో భాగంగా జాతీయ అవార్డు విన్నర్ ఆదిత్య ధ‌ర్ ద‌ర్శ‌క‌త్వంలో ఓ సినిమా చేసేందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఇందులో విక్కీ కౌశల్  హీరో గా నటించనున్నారు. ఉరి తర్వాత ఆదిత్య ధ‌ర్-విక్కీ కాంబోలో రాబోతున్న రెండో సినిమా ఇది.

మ‌హాభార‌త కాలం నాటి క‌థాంశానికి ఫిక్ష‌న‌ల్ అంశాల‌ను జోడించి ఈ సినిమా రూపుదిద్దుకోనున్న‌ట్లు స‌మాచారం. ఇందులో స‌మంత పాత్ర డిఫ‌రెంట్‌గా ఉంటుంద‌ని చెబుతున్నారు. ఇప్ప‌టికే ఈ సినిమా షూటింగ్ మొద‌లుకావాల్సింది. కొన్ని కారణాల వలన ఆలస్యమవుతూ వస్తోంది. వ‌చ్చే ఏడాది ఫిబ్ర‌వ‌రిలో షూటింగ్ మొద‌లుపెట్టేందుకు చిత్ర యూనిట్ ప్లాన్ చేస్తున్న‌ట్లు స‌మాచారం.