బ్రేకింగ్ : మునుగోడు ఉప ఎన్నిక షెడ్యూల్‌ విడుదల

తెలంగాణలో ఎన్నికల నగారా మోగింది. మునుగోడు ఉప ఎన్నికకు షెడ్యూల్‌ విడుదలైంది. నవంబర్‌ 3న మునుగోడులో ఉప ఎన్నిక పోలింగ్‌ నిర్వహించనున్నారు. నవంబర్‌ 6న ఓట్ల లెక్కింపు చేపట్టి ఫలితాన్ని ప్రకటించనున్నారు. ఉప ఎన్నికకు ఈనెల 7న నోటిఫికేషన్‌ విడుదల చేయనున్నట్లు కేంద్ర ఎన్నికల సంఘం (ఈసీ) తెలిపింది. నామినేషన్ల స్వీకరణకు ఈనెల 14 వరకు గడువు విధించింది. 15న నామినేషన్ల పరిశీలన, 17న ఉపసంహరణకు తుది గడువుగా పేర్కొంది.

మునుగోడు కాంగ్రెస్ ఎమ్మెల్యేగా ఉన్న కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి.. రాజీనామాతో ఈ ఉప ఎన్నిక అనివార్యం అయిన సంగతి తెలిసిందే. ఆయన కాంగ్రెస్ వీడి బీజేపీ చేరారు. కమలం గుర్తుపైనే ఉప ఎన్నిక బరిలో దిగబోతున్నారు. ఇక కాంగ్రెస్ అభ్యర్థిగా స్రవంతి రెడ్డి బరిలో దిగబోతున్నారు. ఇప్పటికే ఆమె అభ్యర్థిత్వం ఖరారైన సంగతి తెలిసిందే. టీఆర్ ఎస్ అభ్యర్థిని ఇంకా ఖరారు చేయాల్సి ఉంది. ఈ ఉప ఎన్నికలో గెలిచిన బూస్ట్ తో అసెంబ్లీ ఎన్నికలకు పోవాలని బీజేపీ భావిస్తోంది. 

మరోవైపు తమ సిట్టింగ్ స్థానాన్ని నిలబెట్టుకోవాలని హస్తం పార్టీ భావిస్తుంది. ఒక రకంగా ఈ ఉప ఎన్నిక టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డికి అగ్ని పరీక్ష. ఇక ప్రభుత్వంపై వ్యతిరేకత లేదని నిరూపించుకోవాలంటే మునుగోడు ఉప ఎన్నికలో టీఆర్ ఎస్ గెలువాల్సిన పరిస్థితి. ఓడితే.. ఆ ప్రభావం రాబోయే అసెంబ్లీ ఎన్నికల్లో పడనుంది.