అలర్ట్ : హైదరాబాద్ లో కొత్త ట్రాఫిక్ రూల్స్
హైదరాబాద్ లో ఈరోజు నుంచి కొత్త ట్రాఫిక్ రూల్స్ అమలులోకి వచ్చాయి. ట్రాఫిక్ ఫోలీసుల ఆపరేషన్ ‘రోడ్ అబ్‌స్ట్రక్టివ్ పార్కింగ్ అండ్ ఎంక్రోచ్‌మెంట్’ (రోప్) అమల్లోకి వచ్చింది. స్టాప్‌లైన్ దాటితే రూ. 100 ఫైన్ కట్టాల్సిందే.
ట్రాఫిక్ కూడళ్ల వద్ద రెడ్‌లైట్ వెలిగినప్పుడు పాదచారులు అటూ, ఇటూ దాటేందుకున్న తెల్లగీతల (స్టాప్‌లైన్)ను లెక్కచేయకుండా దూసుకెళ్లేవారిపై ట్రాఫిక్ పోలీసులు కఠినంగా వ్యవహరించనున్నారు. స్టాప్‌లైన్‌ను దాటేసి వెళ్తున్న వాహదారులకు ప్రస్తుతం రూ.100 జరిమానా విధిస్తుండగా.. ఈరోజు నుంచి రూ.200 జరిమానా వేయనున్నారు.
ఇక ఎడమవైపు వెళ్లే (ఫ్రీ-లెఫ్ట్) వాహనదారులకు అడ్డుగా ఉన్న వారికి రూ.1000 జరిమానా విధించనున్నట్లు పోలీసులు తెలిపారు. దుకాణదారులు ఫుట్‌పాత్‌లను ఆక్రమిస్తే జరిమానా విధించడంతోపాటు కేసులు పెట్టనున్నారు. పాదచారులకు ఆటంకం కలిగించేలా పార్కింగ్ చేస్తే రూ.600 జరిమానా విధించనున్నారు.