డెత్ ఓవర్ల సవాల్.. రోహిత్ ఏమన్నాడంటే ?

ఆదివారం దక్షిణాఫ్రికాతో జరిగిన మ్యాచ్‌లో మొదట బ్యాటింగ్‌ చేసిన టీమ్‌ ఇండియా..  3 వికెట్లకు 237 పరుగుల భారీ స్కోరు సాధించింది. ఛేదన ఆరంభంలో తడబడ్డా దక్షిణాఫ్రికా ఆ తర్వాత గట్టి పోటీ ఇచ్చింది. మిల్లర్‌ (106 నాటౌట్‌; 47 బంతుల్లో 8×4, 7×6), డికాక్‌ (69 నాటౌట్‌; 48 బంతుల్లో 4×3, 4×6) చెలరేగడంతో 3 వికెట్ల నష్టానికి 221 పరుగులు చేసింది. లక్ష్యానికి కేవలం 16 పరుగుల దూరంలోనే సఫారీలు నిలిచిపోయారు.

కొండంత స్కోరు చేసినా బౌలర్లు తేలిపోవడంతో గెలుపు కోసం భారత్‌ కష్టపడక తప్పలేదు. ఈ నేపథ్యంలో మరోసారి టీమ్‌ ఇండియా డెత్‌ ఓవర్ల బౌలింగ్‌పై చర్చ మొదలైంది. మ్యాచ్‌ అనంతరం ఈ అంశంపై కెప్టెన్ రోహిత్‌ కూడా స్పందించాడు. “డెత్‌ ఓవర్లలో బౌలింగ్‌, బ్యాటింగ్‌ చేయడం కష్టంతో కూడుకున్న పని. ఆట ఫలితం తేలేదీ ఇక్కడే. ఇది ఆందోళన చెందే విషయమని నేను చెప్పను. కానీ.. ఇది కచ్చితంగా మనం కలిసికట్టుగా చర్యలు తీసుకోవాల్సిన అంశం” అని చెప్పుకొచ్చాడు. ఈ మ్యాచ్‌లో ఏకంగా 62 పరుగులివ్వడమే కాదు.. మూడు నోబాల్స్‌, రెండు వైడ్లు వేసి మరింత ఆందోళనకు గురి చేశాడు.