రాముడు, కృష్ణుడు బాడీబిల్డర్లు కాదు

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్‌ రాముడిగా ఓంరౌత్‌ తెరకెక్కిస్తున్న మైథలాజికల్‌ మూవీ ‘ఆది పురుష్‌’. సీతగా కృతి సనన్‌, లంకేష్‌ పాత్రలో సైఫ్‌ అలీఖాన్‌ నటిస్తున్నారు. దసరా కానుకగా విడుదలైన టీజర్‌పై సోషల్‌మీడియాలో ట్రోలింగ్స్‌ వస్తున్న సంగతి తెలిసిందే. #DisappointingAdipurish యాష్ ట్యాగ్ గత కొద్దిరోజులుగా ట్రెండింగ్ టాప్ లో కొనసాగుతుంది. యానిమేషన్ సినిమాలా ఉందంటూ క్రిటిక్స్ పెదవి విరిస్తున్నారు.

తాజాగా ‘ఆది పురుష్‌’ టీజర్‌ను చూసిన ‘శక్తిమాన్‌’ పాత్రధారి ముఖేష్‌ఖన్నా తన అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు.  ‘ఇటు రాముడు.. రాముడిగానూ, అటు హనుమాన్‌.. హనుమంతుడిగానూ కనిపించడం లేదు. దేవుళ్లు ఎవరూ ఆర్నాల్డ్‌ ష్వాజ్‌నెగ్గర్‌లా ఉండరు.  రాముడు, కృష్ణుడిని చూడండి. వాళ్లేమీ బాడీ బిల్డర్స్‌ కాదు. వాళ్ల ముఖాలు సున్నితంగా, విధేయతతో ఉంటాయి. కోమలమైన సౌందర్యం కలిగి ఉంటారు తప్ప గడ్డాలు, మీసాలు కలిగి ఉండరు’’ అని కాస్త ఘాటూగానే స్పందించారు.