‘కాంతారా’ తెలుగులో ఎప్పట్నుంచి అంటే ?
కన్నడ లేటెస్ట్ బ్లాక్‌బస్టర్ కాంతారా. విలేజ్ యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా రూపొందిన ఈ సినిమా తొమ్మిది రోజుల్లోనే 55 కోట్లకుపైగా వసూళ్లను రాబట్టింది. కన్నడ అగ్ర హీరోల ప్రశంసలు అందుకున్న ఈ సినిమా తెలుగులో రిలీజ్ అవుతోంది. గీతా ఫిల్మ్స్ డిస్ట్రిబ్యూషన్ ద్వారా అల్లు అరవింద్ ఈసినిమాను తెలుగులో విడుదలచేస్తున్నారు.
ఈ నెల 15న కాంతారా సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నట్లు అల్లు అరవింద్ తెలిపారు. హీరోగా నటిస్తూనే ఈ సినిమాకు దర్శకత్వం వహంచాడు రిషబ్ శెట్టి. కేజీఎఫ్ ఫేమ్ హోంబలే ఫిల్మ్స్ కన్నడంలో ఈ సినిమాను నిర్మించింది. ఈ సినిమాలో కిషోర్, సప్తమి, అచ్యుత్ కుమార్ కీలక పాత్రలు పోషించారు. అజనీష్ లోకనాథ్ సంగీతాన్ని అందించాడు.
కాంతారా అంటే సంస్కృత భాషలో అడవి అని అర్థం. ప్రేమను చూపిస్తే అంతకుమించి ప్రేమను, విధ్వంసాన్ని సృష్టిస్తే అంతకుమించిన విధ్వంసాన్ని రిటర్న్ గిఫ్ట్‌గా అడవి ఇస్తుందనే పాయింట్‌తో ఈ సినిమా తెరకెక్కింది. ఈ సినిమా తెలుగుతో పాటు తమిళ్, హిందీ, మలయాళ బాషల్లో రిలీజ్ కానుంది. అక్టోబర్ 14న హిందీ లో విడుదల కానుంది. తమిళ్, మలయాళ రిలీజ్ డేట్స్ ఇంకా ఫిక్స్ కావాల్సి ఉంది.
#Kantara in #Telugu this 15th October! @GeethaArts Release. #KantaraTelugu pic.twitter.com/JaeEevRo9l— OTTRelease (@ott_release) October 9, 2022