మనోజ్ రెండో పెళ్లి.. మంచు లక్ష్మి ఏమన్నారంటే ?

హీరో మంచు మనోజ్ త్వరలో రెండో పెళ్లి చేసుకోబోతున్నట్లు వార్తలు వినిపిస్తున్న సంగతి తెలిసిందే. ఈ వార్తలపై మనోజ్ అక్క మంచు లక్ష్మీ స్పందించారు. శనివారం ఆమె పుట్టినరోజు సందర్భంగా మీడియాతో మాట్లాడారు.

ఈ సందర్భంగా మనోజ్ రెండో పెళ్లి గురించి ప్రశ్నించగా.. “ఎవరి బతుకు వాళ్లని బతకనివ్వండి. ఇప్పుడున్న రోజుల్లో నిస్వార్థమైన, నిజాయతీ కలిగిన ప్రేమను పొందడం చాలా కష్టం. మనోజ్‌ అలాంటి ప్రేమను పొందుతున్నదుకు నేనెంతో ఆనందిస్తున్నా. అతనికి ఎప్పుడూ నా ఆశీస్సులు ఉంటాయి” అన్నారు.

ప్రస్తుతం మంచి లక్ష్మీ  ‘అగ్ని నక్షత్రం’ అనే సినిమాలో నటిస్తున్నారు. మోహన్‌బాబు ప్రధాన పాత్ర  పోషిస్తోన్న ఈ సినిమాలో ఆమె కీలకపాత్రలో కనిపించనున్నారు. దీనితోపాటు ఆమె ‘ఆహా’ వేదికగా ప్రసారమవుతోన్న ‘చెఫ్‌ మంత్ర సీజన్‌ -2’కు వ్యాఖ్యాతగానూ వ్యవహరిస్తున్నారు. ఇక ఖాళీ సమయం దొరికినప్పుడల్లా.. లక్ష్మీ ముంబై చెక్కేసి.. అక్కడ రకుల్ ప్రీత్ సింగ్ తో కలిసి జాలీగా ఎంజాయ్ చేయడం అలవాటు చేసుకుంది.