పని మొదలు పెట్టిన సూర్య

పొట్టి ప్రపంచ కప్ కు సమయం దగ్గర పడుతుంది. ఈ నెల 16 నుంచి మెగా టోర్నీ ప్రారంభం కానుంది. 23న టీమిండియా పాక్ తో తలపడనుంది. ఇప్పటికే ఆస్ట్రేలియా చేరిన రోహిత్ సేన ప్రాక్టీస్ మొదలు పెట్టింది. తొలి ప్రాక్టీస్ సెషన్ పూర్తి చేసింది. ఈ సందర్భంగా భారత స్టార్‌ బ్యాట్స్‌మన్‌ సూర్యకుమార్‌ యాదవ్‌  మీడియాతో మాట్లాడారు. వాతావరణ పరిస్థితులకు అలవాటు పడేందుకు ఉత్సుకతతో ఉన్నానని చెప్పారు.

“ఇక్కడికి వచ్చి సాధన చేసేందుకు నేను చాలా ఎదురుచూశాను. మైదానంలోకి అడుగుపెట్టి.. నడిచి.. పరిగెత్తి.. ఇక్కడ ఎలా ఉంటుందో తెలుసుకోవాలనుకొన్నాను. ఇక్కడి వికెట్‌పై పేస్‌ ఎలా ఉంటుందో తెలుసుకోవాలనుకున్నాను. వికెట్‌ బౌన్స్‌ను చూడాలనుకొన్నాను. తొలి నెట్‌ సెషన్‌ అద్భుతంగా ఉంది. పిచ్‌పై బౌన్స్‌ ఉన్నట్లు సాధన సమయంలో గమనించాను. వికెట్‌పై పేస్‌.. ఆస్ట్రేలియాలో గ్రౌండ్‌ కొలతలు గురించి చాలా మంది మాట్లాడుతారు. ఈ వికెట్లపై మంచి స్కోర్ సాధించడానికి అవసరమైన గేమ్‌ప్లాన్‌ సిద్ధం చేసుకోవడానికి ఇవి చాలా కీలకం” అని అని విశ్లేషించాడు.