ట్రైలర్ : #UnstoppableWithNBKS2.. మరింత రంజుగా !

అన్‌స్టాపబుల్ విత్ ఎన్బీకే సీజన్ 2 కోసం ప్రేక్షకులంతా ఎంతో ఆసక్తిగా ఎందురుచూస్తున్నారు. అక్టోబర్ 14న మొదటి ఆట. ఈ నేపథ్యంలో ట్రైలర్ రిలీజ్ చేశారు మేకర్స్.
ప్రశ్నల్లో మరింత ఫైర్!
ఆటల్లో మరింత డేర్!!
సరదాల్లో మరింత సెటైర్!!!
మీకోసం… మరింత రంజుగా…
Season 2 streaming from October 14th, every Friday on aha!
దెబ్బకు థింకింగ్ మారిపోవాలా! …
అంటూ ట్రైలర్ ను పవర్ ఫుల్ గా ప్రజెంట్ చేశారు. ట్రైలర్ లో పవర్ ప్యాక్డ్ కనిపించింది. బ్లాక్ బస్టర్ ట్రైలర్ అంటూ నెటిజన్లు ఫిదా అవుతున్నారు. గత సీజన్లో మోహన్ బాబు, నాని, అల్లు అర్జున్, విజయ్ దేవరకొండ, పూరి జగన్నాథ్, రవితేజ, గోపిచంద్ మలినేని, మహేశ్ బాబు తదితరులు ఈ షోకు హాజరయ్యారు. ఈ సీజన్‌కు టాలీవుడ్ స్టార్ హీరోల్లో చాలా మంది రాబోతున్నట్లు సమాచారం. పవర్ స్టార్ పవన్‌కల్యాణ్, మెగాస్టార్ చిరంజీవి, త్రివిక్రమ్ శ్రీనివాస్, అనుష్క శెట్టి లాంటి వాళ్లు ఇందులో భాగం కాబోతున్నారని తెలుస్తోంది.