అభిషేక్ రావు తర్వాత సీబీఐ టార్గెట్ కవిత ?
ఢిల్లీ లిక్కర్ స్కాం లో అరెస్టుల పర్వం కొనసాగుతోంది. తాజాగా బోయినపల్లి అభిషేక్ రావును సీబీఐ అరెస్ట్ చేసింది. అభిషేక్ రావు తెలంగాణ సీఎం కేసీఆర్ కూతురు, ఎమ్మెల్సీ ఎమ్మెల్సీ కవిత సమీప బంధువుగా ప్రచారం జరుగుతోంది. అభిషేక్ రావును అరెస్ట్ చేసి ఢిల్లీ తరలించడంతో ఇప్పుడు ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత చుట్టూ కూడా ఈడీ, సీబీఐల నిఘా ఉన్నట్టు వార్తలు వినిపిస్తున్నాయి.
ఢిల్లీ లిక్కర్ పాలసీ ఖరారు చేసే విషయంలో టిఆర్‌ఎస్ ఎమ్మెల్సీ కవిత పాత్ర ఉందని బీజేపీ ఆరోపిస్తోంది. ఈ కేసులో ఏ5గా ఉన్న విజయ్ నాయర్, సమీర్ మహీంద్రుల నుంచి సేకరించిన సమాచారం ఆధారంగా అభిషేక్ రావును సిబిఐ అరెస్ట్ చేసింది.
కేసీఆర్ పుట్టిన రోజు సందర్భంగా ఫిబ్రవరి 17న కవిత తిరుపతి వెళ్లిన సమయంలో ఆమెతో పాటు రామచంద్ర పిళ్లై, అభిషేక్ రావులు తిరుమల వెళ్లారు. ఆ సమయంలో కవితకు ప్రత్యేక విమానాన్ని అభిషేక్ రావు సమకూర్చినట్లు సీబీఐ ఆరోపిస్తోంది. దాదాపు తొమ్మిది సంస్థల్లో డైరెక్టర్‌గా ఉన్న అభిషేక్, పంజాబ్ ఎన్నికల్లో ఢిల్లీ నేతలకు రూ. 200 కోట్లకు పైగా చెల్లింపులు సీబీఐ ఆరోపణలు చేస్తుంది. ఈ నేపథ్యంలో ఢిల్లీ లిక్కర్ స్కాం లో కవిత అరెస్ట్ కావడం ఖాయమనే ప్రచారం జరుగుతుంది.