ప్రాజెక్ట్ K : బిగ్ బీ బర్త్ డే స్పెషల్

‘మహానటి’ దర్శకుడు నాగ్ అశ్విన్ దర్శకత్వంలో పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ నటిస్తున్న చిత్రం ‘ప్రాజెక్ట్ K’. ప్రభాస్ కు జంటగా బాలీవుడ్ బ్యూటీ దీపికా పదుకొనె నటిస్తున్నారు. బిగ్ బీ అమితాబ్ కీలక పాత్రలో నటిస్తున్నారు. ఈరోజు బిగ్ బీ బర్త్ డే కానుకగా ప్రాజెక్ట్ కె నుంచి స్పెషల్ పోస్టర్ ఒకటి రిలీజ్ చేశారు. అమితాబ్ లుక్ ను రివీల్ చేయకుండా.. ఆయన చేతి పంచ్ పిక్ ఒకటి షేర్ చేశారు. మరోవైపు, అమితాబ్ తో ప్రభాస్ కేక్ కట్ చేపిస్తున్న ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.

పురాణాలను, టైమ్ మెషీన్ కాన్సెప్ట్ ను మిక్స్ చేస్తూ చేస్తున్న మైథలాజికల్ ఫాంటసీ సినిమా ఇది. విష్ణుమూర్తి కల్కి అవతారం కథ, అలాగే ద్రోణాచార్యుడి కుమారుడు అశ్వద్ధామ పాత్రలను బేస్ చేసుకుని నాగ్ అశ్విన్ ఈ కథను రెడీ చేసినట్టు తెలిసింది. రాముడి పాత్రలో ప్రభాస్, రావణాసురుడిగా సైఫ్ అలీఖాన్, సీత పాత్రలో కృతి సనన్ నటిస్తున్నారు. దాదాపు రూ. 500 కోట్ల భారీ బడ్జెట్ తో వైజ‌యంతీ మూవీస్ ఈ చిత్రాన్ని నిర్మిస్తోంది. వచ్చే ఏడాది ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది.