ప్రిన్స్.. తమిళ జాతిరత్నం !

తమిళ హీరో శివ కార్తికేయన్ తో జాతిరత్నాలు దర్శకుడు అనుదీప్ చేస్తున్న సినిమా ‘ప్రిన్స్’. దీపావళి కానుకగా ఈ నెల 21 విడుదల కానుంది. తాజాగా ట్రైలర్ ను రిలీజ్ చేశారు. ట్రైలర్ చూస్తే.. ఇది పక్కా తమిళ సినిమాని అని అర్థమవుతుంది. ఈ సినిమాని బైలింగ్వల్ అని మొదటి నుండి ప్రచారం చేశారు. శివ కార్తికేయన్ ఈ సినిమాతో తెలుగు ఇండస్ట్రీలోకి అడుగు పెట్టేస్తున్నాడని తెగ హడావిడి చేసేశారు. కానీ ట్రైలర్ తో ఇది తమిళ జాతిరత్నం అని క్లారిటీ వచ్చింది.

ప్రిన్స్ లో భూతద్దం పెట్టి వెదికినా ఒక్క ప్రముఖ తెలుగు నటుడు కనిపించలేదు ట్రైలర్ లో. ఒక ఇండియన్, బ్రిటిష్ అమ్మాయిని ప్రేమించడం దాంతో వచ్చే చిక్కులు. ఈ లైన్ కి ఆనుదీప్ టచ్ కామెడీ. ట్రైలర్ లో వినిపించిన డైలాగులు తెలుగు నటులు చెబితే కొంత హాస్యం పండేది. కానీ అంతా తమిళ బ్యాచే కావడం వలన పొడిపొడిగానే అనిపించింది. మొత్తానికి ఇది పక్కా తమిళ సినిమా అనే సంగతి తేలిపోయింది.