టీమిండియాదే వన్డే సిరీస్‌

మాస్టర్ కార్డ్ వన్డే సిరీస్ ను టీమిండియా సొంతం చేసుకుంది. నిర్ణయాత్మక ఆఖరి వన్డేలోనూ భారత్‌ విజయం సాధించింది. టాస్ ఓడి తొలుత బ్యాటింగ్‌ చేసిన దక్షిణాఫ్రికా 27.1 ఓవర్లలో 99 పరుగులకే కుప్పకూలింది. కుల్‌దీప్‌ తన బౌలింగ్‌ స్పెల్‌ (4.1-1-18-4)ను అదరగొట్టాడు. సుందర్, సిరాజ్ తలో రెండు వికెట్లు, షాబాద్ ఒక వికెట్ పడగొట్టారు.

అనంతరం లక్ష్య ఛేదనలో 19.1 ఓవర్లలో మూడు వికెట్లను నష్టపోయి 105 పరుగులు చేసి టీమ్‌ఇండియా గెలిచింది. దీంతో మూడు వన్డేల సిరీస్‌ను భారత్‌ 2-1 తేడాతో సొంతం చేసుకొంది. శుభమన్ గిల్ 49, శ్రేయస్ అయ్యార్ 28 పరుగులతో రాణించారు.

దక్షిణాఫ్రికా తమ వన్డే చరిత్రలో నాలుగో అత్యల్ప స్కోరును నమోదు చేసింది. అంతకుముందు ఆస్ట్రేలియాపై  69, ఇంగ్లాండ్‌ మీద 83 (రెండుసార్లు), తాజాగా 99 పరుగులు మాత్రమే చేసింది. భారత్‌పై దక్షిణాఫ్రికాకు ఇదే అత్యల్పం కావడం గమనార్హం. గతంలో నైరోబీ వేదికగా (1999) జరిగిన మ్యాచ్‌లో 117 పరుగులకే ఆలౌటైంది.