ఊర్వశి.. ఓ సైకో !

బాలీవుడ్‌ నటి ఊర్వశి రౌతెలా ఓ సైకో అంటూ నెటిజన్లు విరుచుకుపడుతున్నారు. ఇంతకీ ఏమైందంటే.. టీ20 ప్రపంచకప్‌ కోసం ఇప్పటికే టీమ్‌ఇండియా ఆస్ట్రేలియా చేరుకుంది. మరోవైపు ఊర్వశి కూడా ఆస్ట్రేలియా వెళ్తున్నానని విమానంలో ఉన్న ఫొటోను సోషల్ మీడియాలో పోస్టు చేసింది. పైగా దీనికి ‘‘నా హృదయాన్ని అనుసరిస్తున్నా. అది నన్ను ఆస్ట్రేలియాకు నడిపించింది’’ అనే కామెంట్ పెట్టింది.

‘ఆర్‌.పి’ అనే వ్యక్తి తనను కలిసేందుకు దిల్లీ హోటల్లో రాత్రి ఎదురు చూశాడని, కానీ తనకు కుదరలేదని పంత్‌ను ఉద్దేశిస్తూ ఆమె ఇటీవల ఓ ఇంటర్వ్యూలో చెప్పింది. ప్రజాదరణ, వార్తల్లో నిలవడం కోసం కొంతమంది ఇలా ప్రవర్తిస్తారని పంత్‌ ఘాటుగానే స్పందించాడు. ‘‘సోదరీ.. నన్ను ఒంటరిగా వదిలేయ్‌’’ అని కూడా పేర్కొన్నాడు. ఆ తర్వాత ఆసియా కప్‌ కోసం ఆమె యూఏఈ వెళ్లింది. ఇప్పుడు ఆస్ట్రేలియాకూ చేరుకోవడంతో పంత్‌ను ఆమె వేధిస్తోందని నెటిజన్లు మండిపడుతున్నారు.