కేంద్ర కేబినెట్ కీలక నిర్ణయాలివే.. !
రైల్వే ఉద్యోగులకు గుడ్‌న్యూస్ కేంద్రం కేబినెట్ గుడ్ న్యూస్ చెప్పింది. బుధవారం ప్రధాని నరేంద్ర మోడీ అధ్యక్షతన బుధవారం జరిగిన కేంద్ర కేబినెట్ పలు కీలక నిర్ణయాలు తీసుకుంది. రైల్వే ఉద్యోగులకు కేంద్రం గుడ్‌న్యూస్ చెప్పింది. నాన్ గెజిటెడ్ ఉద్యోగులకు ఉత్పత్తి ఆధారిత బోనస్(పీఎల్బీ)ని ప్రకటించింది. 78 రోజుల వేతనాన్ని బోనస్‌ను ఇస్తున్నట్టు ప్రకటించిన కేంద్రం.. ఇందు కోసం రూ.1832.09 కోట్లు కేటాయించనున్నట్టు తెలిపింది.
ఇక ప్రభుత్వరంగ చమురు సంస్థలకు కేంద్ర ప్రభుత్వం భారీ ఆర్థిక సాయం ప్రకటించింది. గత రెండేళ్లలో (2020 జూన్ నుంచి 2022 జూన్ వరకు) వంటగ్యాస్ విక్రయాల్లో వచ్చిన నష్టాన్ని భర్తీ చేసేందుకు వీలుగా ఆయా సంస్థలకు పరిహారం ఇవ్వాలని కేంద్ర కేబినెట్ నిర్ణయించింది.
ఇందులో భాగంగా చమురు మార్కెటింగ్ కంపెనీలైన ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ (IOC), భారత్ పెట్రోలియం కార్పొరేషన్ (BPCL), హిందుస్థాన్ పెట్రోలియం కార్పొరేషన్ లిమిటెడ్ (HPCL) సంస్థలకు వన్‌టైం గ్రాంటు కింద రూ.22 వేల కోట్లు ఆర్థిక సాయం ఇవ్వనున్నట్టు ప్రకటించింది. గత రెండేళ్ల కాలంలో అంతర్జాతీయంగా వంటగ్యాస్ ధరలు దాదాపు 300 శాతం పెరిగినప్పటికీ ప్రభుత్వం నిర్ణయించిన ధరలకే ఈ మూడు సంస్థలు వినియోగదారులకు వంటగ్యాస్ సరఫరా చేసినట్టు తెలిపింది.