మహేష్ న్యూ లుక్.. అదిరింది

సూపర్ స్టార్ మహేష్ బాబు కొత్త లుక్ లోకి మారిపోయారు. దీనికి సంబంధించిన ఫొటోని ప్రముఖ సెలబ్రిటీ హెయిర్‌ స్టైలిష్ట్‌ ఆలీమ్‌ హకీమ్‌ ట్విటర్‌లో షేర్‌ చేశారు దానికి “నిశ్శబ్దంగా ఉండండి.. మన హాట్‌ సూపర్‌స్టార్‌ మహేశ్‌బాబు వచ్చేశారు’’ అని కామెంట్ పెట్టారు. 

ఈ ఫొటోలో మహేశ్‌ కూల్‌ లుక్‌తో స్టైలిష్‌గా కనిపించారు. ప్రస్తుతం ఈ ఫొటో నెట్టింటిని షేక్‌ చేస్తోంది. ‘సర్కారువారి పాట’ తర్వాత మహేశ్‌.. త్రివిక్రమ్‌ సినిమాలో నటిస్తోన్న విషయం తెలిసిందే. సితార ఎంటర్‌టైన్‌మెంట్స్‌ పతాకంపై సిద్ధమవుతున్న ఈ సినిమాలో పూజాహెగ్డే కథానాయిక. త్రివిక్రమ్ సినిమా తర్వాత రాజమౌళీ డైరెక్షన్ లో మహేష్ సినిమా ఉండనుంది.