పెళ్లిపై క్లారిటీ ఇచ్చిన రకుల్

టాలీవుడ్ స్టార్ హీరోయిన్ రకుల్ బాలీవుడ్ నటుడు, నిర్మాత జాకీ భగ్నానీ ప్రేమలో ఉన్న విషయం తెలిసిందే. వీరిద్దరూ అతి త్వరలో పెళ్లి చేసుకోనున్నారంటూ రకుల్ తమ్ముడు అమన్‌ప్రీత్ చెప్పినట్లు వార్తలు వచ్చాయి. ఈ ప్రచారంపై తాజాగా రకుల్ స్పందిస్తూ.. ‘‘అమన్.. నా పెళ్లిపై నువ్వు నిజంగానే స్పష్టతనిచ్చావా? నా పెళ్లి గురించి నాక్కూడా చెప్పాలి కదా బ్రో..! నా జీవితం గురించి నాకే తెలియకపోవడం హాస్యాస్పదంగా ఉంది’’ అని ట్వీట్ చేసింది.

ప్రస్తుతం రకుల్ బాలీవుడ్ లో బిజీగా గడుపుతోంది. ఏకంగా ఎనిమిది సినిమాల్లో నటించింది. ఇందులో నాలుగు సినిమాలు రిలీజ్ అయ్యాయి. మరో నాలుగు ‘డాక్టర్ జీ’, ‘థ్యాంక్ గాడ్’, ‘ఛత్రివాలి’, ‘ఇండియన్ – 2’ రిలీజ్ కు రెడీ అవుతున్నాయి. ఈ నేపథ్యంలో త్వరలో మళ్లీ తెలుగు తెరపై కనిపిస్తానని రకుల్ చెబుతోంది.