అధిష్టానంపై థరూర్ అసంతృప్తి

కాంగ్రెస్ అధ్యక్షపదవి కోసం సీనియర్ నేతలు నేత శశిథరూర్‌, మల్లిఖార్జున ఖర్గేల మధ్య ప్రధాన పోటీ నెలకొన్న సంగతి తెలిసిందే. అధ్యక్ష ఎన్నిక విషయంలో థరూర్ అధిష్టానంపై అసంతృప్తి వ్యక్తం చేశారు. మరో అభ్యర్థి మల్లిఖార్జున ఖర్గేకు తనకూ మధ్య చూపుతోన్న వ్యత్యాసంపై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. ఇది పారదర్శక ఎన్నిక ప్రక్రియను దెబ్బతీస్తుందని అన్నారు.

ఏ రాష్ట్రం వెళ్లినా.. కాంగ్రెస్ రాష్ట్ర అధ్యక్షులు, ఇతర నేతలు ఖర్గేను ఆత్మీయంగా ఆహ్వానిస్తున్నారు. పలుచోట్ల నేను ఈ విషయాన్ని గమనిస్తున్నాను. అదంతా ఒక అభ్యర్థికే జరుగుతోంది. నా విషయంలో మాత్రం భిన్నంగా ఉంది. నేను వెళ్లిన దగ్గర రాష్ట్ర అధ్యక్షులు అందుబాటులో ఉండటం లేదు. ఇక్కడ నేను ఫిర్యాదులేమీ చేయడం లేదు. కానీ మీకు ఆ వ్యత్యాసం కనిపించడం లేదా..? మరోవైపు థరూర్ నాకు సోదర సమానుడు. మా ఇద్దరి మధ్య ఎలాంటి తేడాలు లేవు. నేతలు, ప్రతినిధులు కలిసి నన్ను అధ్యక్ష అభ్యర్థిగా నిలబెట్టారు. గాంధీ కుటుంబం పేరును ఇందులోకి లాగడం బీజేపీ కుట్రలో భాగమే. దానికి తగ్గట్టే కొందరు ప్రవర్తిస్తున్నారు. దీనిని ఖండిస్తున్నానని ఆయన అన్నారు.