భారత్ జోడో యాత్ర ఏపీలోకి ఎంటర్

కన్యాకుమారి నుంచి కాశ్మీర్ వరకు తలపెట్టిన భారత్ జోడో యాత్ర ఏపీలో ప్రవేశించింది. కర్ణాటకలో గత కొద్ది రోజులుగా సాగుతున్న భారత్ జోడో యాత్ర శుక్రవారం అనంతపురం జిల్లా డీ హీరేహాళ్ వద్ద ఏపీలోకి ఎంటర్ అయింది. కర్ణాటక, ఆంధ్రా సరిహద్దుల్లో వేలాది మంది రాహుల్‌కు స్వాగతం పలికారు.
రాహుల్ గాంధీకి కాంగ్రెస్ పార్టీ పీసీసీ మాజీ అధ్యక్షులు రఘువీరారెడ్డి, మాజీ మంత్రి సాకే శైలజానాథ్ ఘన స్వాగతం పలికారు. అనంతపురం జిల్లాలో 12 కిలోమీటర్ల పాదయాత్ర కొనసాగించి. తర్వాత కర్ణాటకలోని బళ్లారిలోకి వెళ్తారు. ఇక రాహుల్ యాత్ర కర్ణాటక మీదుగా కృష్ణానదిని దాటి తెలంగాణలో ప్రవేశిస్తుంది.