బింబిసార ఓటీటీ రిలీజ్ డేట్ ఫిక్స్

నందమూరి కల్యాణ్‌రామ్‌ హీరోగా కొత్త దర్శకుడు వశిష్ఠ తెరకెక్కించిన చిత్రమిది బింబిసార. ఈ ఫాంటసీ యాక్షన్‌ చిత్రం దీపావళి కానుకగా ఈ నెల 21న ఓటీటీ ‘జీ 5’ లో  రిలీజ్ కాబోతుంది. థియేటర్స్ లో అదరగొట్టిన బింబిసార ఓటీటీలోనూ సూపర్ హిట్ అవ్వడం ఖాయం అంటున్నారు.

ఈ చిత్రంలో కల్యాణ్‌రామ్‌.. బింబిసారుడు, దేవదత్తుడు అనే రెండు విభిన్న పాత్రలు పోషించిన సంగతి తెలిసిందే. క్రీస్తు పూర్వం 500 సంవత్స‌రానికి చెందిన‌ త్రిగ‌ర్త‌ల సామ్రాజ్యాధినేత బింబిసారుడు (క‌ల్యాణ్ రామ్‌). క్రూర‌త్వానికి ప్ర‌తీక ఆయ‌న‌. రాక్ష‌సులు ఎరుగ‌ని రావ‌ణ రూప‌మ‌ది. ఆయ‌న‌ క‌న్ను ప‌డ్డ ఏ రాజ్య‌మైనా.. త్రిగ‌ర్త‌ల సామ్రాజ్యంలో భాగ‌మ‌వ్వాల్సిందే. ఎదురు తిరిగిన వాడు ఎంత‌టి వాడైనా త‌న క‌త్తి వేటుకు మ‌ట్టి క‌ర‌వాల్సిందే. ఆ క‌త్తికి రాజ్య కాంక్ష‌.. అధికార దాహం త‌ప్ప త‌ర‌త‌మ భేదాలు లేవు. క‌నిక‌రం అస్స‌లు తెలియ‌దు. అధికారానికి అడ్డు వ‌స్తాడేమోన‌న్న ఉద్దేశంతో త‌న‌ క‌వ‌ల సోద‌రుడు దేవ‌ద‌త్తుడిని చంపాల‌ని ప్ర‌య‌త్నిస్తాడు. అత‌డి నుంచి త‌ప్పించుకున్న దేవ‌ద‌త్తుడు (క‌ల్యాణ్ రామ్‌)కి.. ఓ మాయదర్పణం సాయంతో బింబిసారుడిని ప్రస్తుతానికి వెళ్లేలా చేస్తాడు. మరి, వర్తమానంలోకి వచ్చిన బింబిసారుడికి ఎలాంటి అనుభ‌వాలు ఎదుర‌య్యాయి? అన్నది ఆసక్తిగా చూపించాడు దర్శకుడు.