నాగచైతన్య సినిమాలో వంటలక్క

అక్కినేని హీరో నాగచైతన్య కోలీవుడ్ దర్శకుడు వెంకట్ ప్రభుతో ఓ సినిమా చేస్తోన్న సంగతి తెలిసిందే. గతేడాది శింబుతో వెంకట్ ప్రభు మానాడు చిత్రం తీసి సూపర్ హిట్ అందుకున్నారు. ప్రస్తుతం నాగచైతన్యతోనూ అదిరిపోయే సినిమా తెరకెక్కించనున్నట్లు ఫిల్మ్ వర్గాల టాక్.

ఇందులో భారీ తారాగణం నటించబోతుంది. దక్షిణాది ప్రముఖ హీరోయిన్ ప్రియమణి, విలక్షణ నటుడు అరవింద్ స్వామి, శరత్ కుమార్, వెన్నెల కిషోర్ లాంటి పెద్ద నటీ, నటులు కీలక పాత్రలను పోషించనున్నారు. అంతేకాకుండా తెలుగు బుల్లితెరపై సంచలనం సృష్టించిన కార్తీక దీపం ఫేమ్ దీప అలియాస్ వంటలక్క కూడా ఇందులో కీలక పాత్ర పోషించబోతున్నట్లు చిత్రబృందం అప్డేట్ ఇచ్చింది.