వందకోట్ల ‘కాంతారా’

జీఎఫ్‌ సృష్టించిన ప్రభంజనం మరవక ముందే కాంతారా అనే మరో కన్నడ సినిమా కలెక్షన్ల వర్షం కురిపిస్తోంది. ఇప్పటికే ఈ సినిమా కర్ణాటకలో రూ.70 కోట్లకుపైగా వసూలు చేసింది. ఇక ప్రపంచవ్యాప్తంగా ఈ వీకెండ్‌ రూ.100 కోట్ల క్లబ్‌లో చేరనుంది.

కాంతారా మాత్రం ఓ చిన్న సినిమాగా రిలీజై ప్రేక్షకుల ఆదరణ సొంతం చేసుకుంది. రిషబ్‌ శెట్టి తానే నటించి, డైరెక్ట్‌ చేసిన ఈ సినిమాకు కన్నడనాట ఫ్యాన్స్‌ ఫిదా అవుతున్నారు. న్నడనాట ఈ సినిమాకు వచ్చిన క్రేజ్‌ చూసి హిందీ, తమిళం, తెలుగుల్లోనూ డబ్‌ చేశారు. శుక్రవారం (అక్టోబర్‌ 14) హిందీలో ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చేసింది. ఇక శనివారం (అక్టోబర్‌ 15) తెలుగు, తమిళంలలో రిలీజ్‌ కానుండటం విశేషం.