పూనమ్‌కౌర్ సీక్రెట్ మ్యారేజ్ ?
పూనమ్‌కౌర్ సీక్రెట్ గా పెళ్లి చేసుకుందా ? అనే అవుననే అంటున్నారు. టిజన్లకు కర్వాచౌత్ (Karwa Chauth) శుభాకాంక్షలు చెబుతూ గురువారం ఓ ఫొటో షేర్ చేసింది పూనమ్. ఇందులో పూనమ్.. జల్లెడ చేతిలో పట్టుకుని చంద్రుడి వైపు చూసి చిరునవ్వులు చిందిస్తూ కనిపించింది.
ఈ ఫొటో చూసిన నెటిజన్లు ‘‘మేడమ్ ఈ పండుగ పెళ్లైన మహిళలు మాత్రమే చేసుకుంటారు. మరి మీరెందుకు చేస్తున్నారు?’’, ‘‘మీకు పెళ్లి కుదిరిందా?’’, ‘‘చంద్రుడిని చూసిన తర్వాత మీరు ఎవరి ముఖాన్ని చూస్తారు?’’ అంటూ ప్రశ్నల వర్షం కురిపిస్తున్నారు. ఉత్తరాది రాష్ట్రాల్లో కర్వాచౌత్ వేడుకలను ఘనంగా నిర్వహిస్తారు. భర్త దీర్ఘాయుష్షును కోరుతూ పెళ్లైన మహిళలు పార్వతీదేవిని పూజించి రోజంతా ఉపవాసం చేస్తారు. చంద్రుడి దర్శనంతోనే ఈ వేడుకలు పూర్తవుతాయి. జల్లెడలో చంద్రుడిని.. ఆ వెంటనే భర్త ముఖాన్ని చూసి ఆశీర్వాదం తీసుకుంటారు. పెళ్లి కాని యువతులు కూడా కాబోయే వారితో కలిసి ఈ పూజలు నిర్వహిస్తారు.