ఆపరేషన్ గౌడ్స్ : బీజేపీలోకి పద్మారావు గౌడ్ ?

తెలంగాణలో అధికార టీఆర్ఎస్ పార్టీ నుంచి బీజేపీలోకి వలసలు కొనసాగే అవకాశాలు కనిపిస్తున్నాయి. భువనగిరి మాజీ ఎంపీ బూర నర్సయ్య గౌడ్ టీఆర్ఎస్ కు రాజీనామా చేసిన సంగతి తెలిసిందే. ఆయన బీజేపీలో చేరేందుకు ఏర్పాట్లు చేసుకుంటున్నట్టు సమాచారం. మునుగోడు ఉప ఎన్నికకు ముందు బూర రాజీనామా టీఆర్ఎస్ కు పెద్ద దెబ్బ అనే చెప్పాలి. తాజాగా డిప్యూటీ చైర్మన్ పద్మారావు గౌడ్ కూడా టీఆర్ ఎస్ కు గుడ్ బై చెప్పబోతున్నట్టు వార్తలు వినిపిస్తున్నాయి.

సీఎం కేటీఆర్ కుటుంబానికి అత్యంత సన్నిహితుడిగా పద్మారావు గౌడ్ కు పేరుంది. ముఖ్యంగా మంత్రి కేటీఆర్, ఎమ్మెల్సీ కవిత లతో పద్మారావుకు మంచి సాన్నిహిత్యం ఉంది. మాస్ లీడర్ పద్మారావు ను కేటీఆర్, కవిత అంకుల్.. అంకుల్ అంటూ తమ పర్సనల్ వ్యవహారాలు చక్క బెట్టుకున్నారనే ప్రచారం కూడా ఉంది. ఈ నేపథ్యంలో పద్మారావు గౌడ్ టీఆర్ ఎస్ ను వీడి.. బీజేపీలో చేరబోతున్నారన్న వార్తలు ప్రాధాన్యత సంతరించుకున్నాయి.

మరోవైపు మొదటి నుంచి బీసీలకు పెద్దపీట వేస్తున్న తెలంగాణ బీజేపీ మున్నూరు కాపులు, ముదిరాజులు, గౌడ, పద్మశాలి… ఎస్, ఎస్టీ లకు అధిక ప్రాధాన్యత ఇస్తుంది. ఇందులో భాగంగానే తాజాగా ఆపరేష గౌడ ప్రారంభించినట్టు కనబడుతున్నది. రెండ్రోజుల క్రితమే బూర నర్సయ్య గౌడ్ టీఆర్ ఎస్ వీడారు. తాజాగా పద్మారావు గౌడ్ అదే దారిలో గులాబీ పార్టీకి గుడ్ బై చెప్పబోతున్నారనే వార్తలు వినిపిస్తున్నాయి.