తిక్క పిల్ల లవ్ లో సాయిధరమ్ తేజ్

మెగా యంగ్ హీరో సాయిధరమ్ తేజ్ కు తిక్క పిల్ల లవ్ ప్రపోజ్ చేసింది. అసలు విషయం ఏంటంటే ? సాయిధరమ్ తేజ్ నటించిన ‘తిక్క’ తో తెలుగు తెరకు పరిచయమైంది బ్రెజిల్ భామ లారిస్సా బొనేసి. ఈ సినిమా షూటింగ్ సమయంలోనే వీరిద్దరి మధ్య స్నేహం ఏర్పడింది. అది ప్రేమగా మారిందనే ప్రచారం జరిగింది.

కట్ చేస్తే.. శనివారం సాయి తేజ్ 36వ పుట్టినరోజు సందర్భంగా.. బొనేసి ట్విటర్ వేదికగా ‘‘హ్యాపీ బర్త్‌డే మై తేజు ’’ అంటూ లవ్ సింబల్‌ని జత చేసింది. దీనికి ‘‘నన్ను ఎప్పుడూ డిస్ట్రబ్ చేసే వ్యక్తి’’ అంటూ సాయి ఆమెకు థ్యాంక్స్ చెబుతూ లవ్ ఎమోజీలు పెట్టాడు. ఆమెతో దిగిన ఓ ఫొటో షేర్ చేశాడు. ఈ ట్వీట్లు చూసిన నెటిజన్లు.. మీరు ‘ప్రేమలో ఉన్నారా?’ అని అడుగుతున్నారు. ‘తిక్క ’ తర్వాత లారిస్సా తెలుగు తెరపై ఎక్కువగా కనిపించలేదు. సందీప్ కిషన్ నటించిన ‘నెక్ట్స్ ఏంటి’లో ఆమె చిన్న పాత్ర కనిపించారు.
Beauty IN Black @larissabonesi ❤️#LarissaBonesi #OTTRelease pic.twitter.com/T0lJxJnEqQ— OTTRelease (@ott_release) January 31, 2022