హిందీ ‘దృశ్యం 2’ ట్రైలర్ టాక్

అజయ్ దేవ్‌గణ్ హీరోగా నటించిన హిందీ ‘దృశ్యం 2’ విడుదలకు రెడీ అవుతోంది. ఈ సినిమా నవంబరు 18న రిలీజ్ కానుంది. ఈ నేపథ్యంలో సోమవారం చిత్ర బృందం ట్రైలర్‌ను రిలీజ్ చేసింది.
ఆద్యంతం ఉత్కంఠగా సాగిన ఈ ట్రైలర్‌లో అజయ్ దేవ్‌గణ్, శ్రియ నటనతోపాటు దేవిశ్రీ ప్రసాద్ అందించిన నేపథ్య సంగీతం ప్రధాన బలంగా నిలిచాయి. అభిషేక్ పాఠక్ దర్శకత్వం వహించిన ఈ సినిమాలో టబు, అక్షయ్ ఖన్నా తదితరులు కీలక పాత్రలు పోషించారు.