K.A పాల్ ‘వర్సెస్’ R.G పాల్.. ఫుల్ కామెడీ !

మునుగోడు ఉప ఎన్నిక ప్రచారంలోకి పొలిటికల్ కమెడియన్ కేఏ పాల్ ఎంట్రీ ఇచ్చేశారు. సోమవారం ఆయన చండూరులో ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా బీజేపీ అభ్యర్థి కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి కి ఎదురుపడ్డారు. ఈ సందర్భంగా రాజగోపాల్ రెడ్డిని ఆప్యాయంగా పలకరించారు. ఏంటీ తమ్ముడు అచ్చం నా లాగే ఉన్నావు అంటూ నవ్వులు పూయించారు. దీంతో.. అక్కడ ఉన్నవారు K.A పాల్ ‘వర్సెస్’ R.G పాల్ అంటూ కామెంట్ చేయడం మరింత ఫన్నీ సీన్ ని తలపించింది.

అంతకుముందు కేఏ పాల్ పోలీసులతో వాగ్వాదానికి దిగారు. నల్గొండ జిల్లా చండూరు ఆర్వో కార్యాలయం వద్ద ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కేఏ పాల్.. పోలీసులతో వాదనకు దిగారు.  పోలీసులు తనతో అనుచితంగా ప్రవర్తించారంటూ కేఏ పాల్ ఆరోపణలు చేశారు. ఏటనుకుంటున్నావ్.. నేను డాక్టర్ కేఏ పాల్ ను.. మీ డీజీపీ నా పర్సన్ సెక్రెటరీ అంటూ తనదైన శైలిలో రెచిపోయారు.