ఆరేళ్ల క్రితమే నయన్ పెళ్లి

కొత్త సమస్యను నుంచి బయటపడటాని పాత నిజాన్ని బయటపెట్టారు నయన్-విఘ్నేష్ దంపతులు. ఏడేళ్ల నుంచి ప్రేమలో ఉన్న నయన్‌-విఘ్నేశ్‌ జంట ఈ ఏడాది జూన్‌లో పెళ్లి చేసుకున్నారు. ఈ నేపథ్యంలోనే అక్టోబర్‌ 9న తమకు ఇద్దరు కవల పిల్లలు పుట్టినట్లు ప్రకటించారు. వీరిద్దరూ సరోగసి పద్ధతిలోనే పిల్లలకు జన్మనిచ్చారని పేర్కొంటూ సోషల్‌మీడియాలో దుమారం రేగింది. భారతదేశంలో సరోగసి విధానంపై నిషేధం ఉందని.. అలాంటప్పుడు వీరిద్దరూ ఎలా పిల్లల్ని కన్నారంటూ పలువురు ప్రశ్నలు లేవనెత్తారు. దీంతో తమిళనాడు ప్రభుత్వం.. నయన్‌ దంపతుల నుంచి వివరణ కోరిన సంగతి తెలిసిందే. 

ఈ నేపథ్యంలో తమకు ఆరేళ్ల క్రితమే పెళ్లి అయ్యిందని పేర్కొంటూ వివాహ నమోదు ధ్రువపత్రాన్ని అఫిడవిట్‌కు జతచేసినట్లు సమాచారం. అంతేకాకుండా నిబంధనల ప్రకారమే గతేడాది డిసెంబర్‌లోనే తాము సరోగసి కోసం రిజిస్టర్‌ చేసుకున్నామని అందులో పేర్కొన్నారట. యూఏఈలో ఉంటోన్న నయన్‌ బంధువు ద్వారా సరోగసి పద్ధతిలో పిల్లలను పొందామని వివరణ ఇచ్చినట్లు తెలుస్తోంది.