రాజకీయాల్లో క్రిమినల్స్ ఉండొద్దు : పవన్
రాజకీయాల్లో క్రిమినల్స్ ఉండొద్దనేది నా ఆశయం అన్నారు జనసేన అధినేత, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్. మంగళగిరిలోని జనసేన పార్టీ కార్యాలయంలో పవన్ సోమవారం మీడియాతో మాట్లాడారు. అధికారంలో ఉన్న పార్టీ గర్జించడమేంటి ? అని పవన్ ప్రశ్నించారు. వైకాపా కోరుకుంటున్న హింసను మేం ఇవ్వలేం. మంత్రుల కార్లపై దాడి జరుగుతుంటే పోలీసులు ఏమైపోయారు? విమానాశ్రయంలో కోడి కత్తి ఘటనపై ఇప్పటికే చర్యలు లేవు. వైకాపా శ్రేణులు ఎన్ని దాడులు చేస్తున్నా పోలీసులు ఎలాంటి కేసులు నమోదు చేయట్లేదు. వైకాపా శ్రేణులు దాడి చేస్తే.. భావప్రకటన అని అప్పటి డీజీపీ సమర్థించారు. వైకాపా శ్రేణులు రాళ్లు విసిరితే భావ స్వేచ్ఛ… ఇతర పార్టీలు నినాదాలు చేస్తే అన్ని సెక్షన్లు వర్తిస్తాయా ? అని పవన్ కల్యాణ్ మండిపడ్డారు.
కుల గొడవలతో ఆంధ్రప్రదేశ్ నిస్సారమైపోతోంది. ఒకసారి తమిళనాడు.. మరోసారి తెలంగాణ తరిమేశాయి. ఇప్పుడు అంతర్గత గొడవలతో మనమే నష్టపోతున్నామని పవన్ అన్నారు. ప్రభుత్వం స్వాధీనం చేసుకున్న విశాఖ దసపల్లా భూములు ప్రైవేటు వ్యక్తుల చేతుల్లోకి వెళ్లాయి. ఉత్తరాంధ్ర మీద ప్రేమ ఉంటే సైనికులకు చెందిన 71 ఎకరాల భూమిని ఎందుకు ఆక్రమిస్తారు? వైకాపా నేతలు చేసే భూకబ్జాలు బయటపడతాయనే జనవాణి కార్యక్రమాన్ని అడ్డుకున్నారని పవన్ అన్నారు.
మా ఆంధ్రప్రదేశ్ ను మా తెలుగు నేలను ఎలా కాపాడుకోవాలో మాకు బాగా తెలుసు మేము ఢిల్లీ దాకా వెళ్లము ఇక్కడే తేల్చుకుంటాం. వైసీపీకి చెప్తున్నా ఇక్కడే తేల్చుకుంటాం.. – JanaSena Chief Sri @PawanKalyan pic.twitter.com/75QToSNJxO— JanaSena Party (@JanaSenaParty) October 17, 2022