కాంతార.. రికార్డ్స్ బ్రేక్

కన్నడ చిత్రం ‘కాంతార’ బ్లాక్ బస్టర్ హిట్ కలెక్షన్స్ రాబడుతోంది. అంతేకాదు..‘ఆర్‌ఆర్‌ఆర్‌’, ‘కేజీయఫ్‌-2’ వంటి భారీ చిత్రాలను బీట్‌ చేసింది. ఐఎండీబీలో ‘కాంతార’కు 9.5 రేటింగ్‌ లభించింది. తాజాగా కాంతర సక్సెస్ పై సంచలన దర్శకుడు రామ్ గోపాల్ వర్మ సూపర్ కామెంట్ చేశారు.

‘‘సూపర్‌స్టార్స్‌, భారీ నిర్మాణ విలువలు, అద్భుతమైన వీఎఫ్‌ఎక్స్‌.. వంటివే ప్రేక్షకుల్ని థియేటర్లకు రప్పిస్తాయని సినిమా వాళ్లందరూ ఒక నిర్ణయానికి వచ్చిన వేళ.. ఎలాంటి అగ్ర తారాగణం లేకుండా తెరకెక్కిన చిన్న చిత్రం ‘కాంతార’ భారీ చిత్రాల రికార్డ్స్ అన్నింటినీ బ్రేక్‌ చేసింది’’ అని వర్మ ట్విట్ చేశారు.