విజయ్ తో త్రివిక్రమ్ సినిమా

రౌడీ హీరో విజయ్‌ దేవరకొండకు మాటల మాంత్రికుడు త్రివిక్రమ్‌ ఒక స్టోరీ లైన్‌ వినిపించారనే న్యూస్ వైరల్ అవుతోంది. అది విజయ్ కి బాగా  నచ్చేసింది. కానీ కొన్ని కారణాల వల్ల ఈ మూవీ ఇప్పటి వరకు పట్టాలెక్కలేదు.

అయితే త్వరలోనే త్రివిక్రమ్‌ ఈ సినిమా మొదలుపెట్టడానికి సన్నాహాలు చేస్తున్నారని, శశి కిరణ్‌ తిక్క ఈ చిత్రానికి దర్శకత్వం వహించనున్నారని ఫిల్మింనగర్‌ టాక్‌. కానీ విజయ్‌ మాత్రం త్రివిక్రమ్‌ దర్శకత్వం వహిస్తేనే ఈ ప్రాజెక్టు చేయడానికి ఆసక్తి చూపుతున్నాడని సమాచారం.

ప్రస్తుతం విజయ్‌  శివ నిర్వాణ దర్శకత్వంలో ‘‘ఖుషి’’లో నటిస్తున్నారు. ఈ సినిమాలో విజయ్‌ సరసన సమంత నటిస్తోంది. మరోవైపు త్రివిక్రమ్ మహేష్ తో ఓ సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. అతడు సినిమాకు సీక్వెల్ గా ఈ సినిమా తెరకెక్కుతోందనే ప్రచారం జరుగుతుంది.