దేశంలోకి ఒమిక్రాన్ సబ్ వేరియంట్
కరోనా మహమ్మారి మళ్లీ విజృభిస్తుంది. చైనాలో వెలుగులోకి వచ్చిన కొత్త వేరియెంట్ తో..అక్కడ కొన్ని నగరాల్లో లాక్ డౌన్ విధిస్తున్నారు. ఇప్పుడీ.. ఈ కొత్త వేరియెంట్ భారత్ లోకి ఎంటర్ అయినట్టు తెలుస్తోంది.
మహారాష్ట్రలో గత వారంతో పోల్చుకుంటే కొత్త కేసులు 17.7 శాతం మేర పెరిగాయి. అందుకు XBB ఉప రకాన్నే కారణని అంటున్నారు. చలికాలం, పండగల సీజన్ ఉండడంతో ఈ వేరియంట్ వ్యాప్తి ఎక్కువగా ఉండొచ్చని అంచనావేస్తున్నారు. ఈ నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలి. తప్పకుండా కరోనా జాగ్రత్తలు పాటించాలని సూచిస్తున్నారు.