కాంతార.. నెంబర్-1, బాహుబలి – 101

కన్నడ సినిమా కాంతార అదరగొడుతోంది. ప్రముఖ ఎంటర్‌టైన్‌మెంట్‌ పోర్టల్‌ ఐఎండీబీ (IMDb) ప్రకటించిన ‘టాప్‌ 250 ఇండియన్‌ ఫిల్మ్స్‌’ (IMDb Top 250) జాబితాలో కాంతార తొలి స్థానాన్ని కైవసం చేసుకుంది. తమ యూజర్స్‌ ఇచ్చిన రేటింగ్స్‌ ఆధారంగా ఐఎండీబీ ఆ లిస్ట్‌ను రూపొందించింది. 

నంబర్‌ 1గా ‘కాంతార’ ఉండగా 2వ స్థానంలో రామాయణ (1993), 3లో రాకెట్రీ (2022), 4లో నాయకన్‌ (1987), 5లో అన్బే శివం (2003), 6లో గోల్‌మాల్‌ (1979), 7లో జై భీమ్‌, 8లో 777 చార్లీ, 9లో పరియెరుమ్‌ పెరుమాళ్‌ (2018), 10లో మణిచిత్రతజు (1993) నిలిచాయి. తెలుగు సినిమాల వివరాలివీ.. కేరాఫ్‌ కంచరపాలెం (17వ స్థానం),  జెర్సీ (22), సీతారామం (39), మహానటి (44), ఏజెంట్‌ సాయి శ్రీనివాస ఆత్రేయ (48), బాహుబలి: ది కన్‌క్లూజన్‌ (101), బొమ్మరిల్లు (125), రంగస్థలం (129), అతడు (134), పెళ్లి చూపులు (146), ఎవరు (155), క్షణం (156), మేజర్‌ (165), వేదం (176), అర్జున్‌ రెడ్డి (179), బాహుబలి: ది బిగినింగ్‌ (182), ఆర్‌ఆర్‌ఆర్‌ (190), ఒక్కడు (209), పోకిరి (212), మనం (217), ఊపిరి (220), హ్యాపీడేస్‌ (236), గూఢచారి (244) స్థానాల్లో ఉన్నాయి.