విక్రమ్ 61 : రష్మిక స్థానంలో మాళవిక

చియాన్ విక్రమ్ నటిస్తోన్న 61వ చిత్రం టెస్ట్ షూటింగు మొదలైన సంగతి తెలిసిందే. పా రంజిత్ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంలో ముందు రష్మికను తీసుకున్నారు. కానీ ఇప్పుడు ఆ స్థానంలో మరో భామ వచ్చి చేరినట్లు తెలుస్తోంది.

ముందు అనుకున్న ప్రకారం రష్మిక నటించాల్సి ఉన్నా ఆమె కాల్షీట్లు సర్దుబాటు కావడం లేదు. దీంతో మాళవిక మోహనన్ తీసుకున్నట్లు సమాచారం. మాళవికకు ఇది నాలుగో తమిళ చిత్రం. ఈ సినిమా చిత్రీకరణ సోమవారం నుంచి కడపలో మొదలైంది. పాన్ ఇండియా సినిమాగా ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నారు.