సర్దార్.. పసందైన విందు భోజనం

పి.ఎస్‌.మిత్రన్‌ దర్శకత్వంలో కార్తి హీరోగా నటించిన సినిమా ‘సర్దార్’. ఈ చిత్రాన్ని అన్నపూర్ణ స్టూడియోస్‌ సంస్థ తెలుగులో విడుదల చేస్తోంది. అక్టోబరు 21న ప్రేక్షకుల ముందుకు రానుంది.

ఈ నేపథ్యంలోనే దర్శకుడు మిత్రన్‌ మాట్లాడుతూ “లవ్‌.. కామెడీ.. యాక్షన్‌.. ఎమోషన్‌.. ఇలా అన్ని రుచులున్న పసందైన విందు భోజనం లాంటి సినిమా ‘సర్దార్‌’ అన్నారు. కొన్ని యథార్థ సంఘటనల స్ఫూర్తితో రాసుకున్న కథ ఇది అన్నారు.