అవునూ.. అనుతో లవ్ ఉన్నా !

అల్లు యంగ్ హీరో అల్లు శిరీష్ హీరోయిన్ అను ఇమ్మాన్యుయేల్‌ తో డేటింగ్ పై తొలిసారి స్పందించారు. వీరిద్దరు కలిసి నటించిన సినిమా ‘ఊర్వశివో రాక్షసివో’. నవంబర్ 4న ప్రేక్షకుల ముందుకు రానుంది.

ఈ సినిమా ప్రమోషన్ లో పాల్గొన్న శిరీష్‌ స్పందించాడు. అను తో డేటింగ్ ప్రచారంపై స్పందించారు. నిజం చెప్పాలంటే మా మధ్య అలాంటిది ఏమీ లేదు. మేమిద్దరం మంచి స్నేహితులం. కొన్ని నెలలపాటు కలిసి పనిచేశాం కాబట్టి మా మధ్య మంచి అనుబంధం ఏర్పడింది. అదీ కాక.. తను చాలా సైలెంట్‌. మా ఇద్దరి వ్యక్తిత్వాలు ఒకేలా ఉంటాయి.

సంగీతం, పుస్తకాలు, సినిమాలు.. ఇలా ఎన్నో విషయాల్లో మా అభిరుచులు కలిశాయి. దానివల్ల మేమిద్దరం ఎక్కువగా మాట్లాడుకోవడానికి అవకాశం ఏర్పడింది. వర్క్‌ విషయంలో తను ప్రొఫెషనల్‌గా ఉంటుంది. అందువల్లే రొమాంటిక్‌ సీన్స్‌ చేసేటప్పుడు ఇబ్బందిపడలేదని చెప్పుకొచ్చారు. అను క్వాలిటీస్ నచ్చాయి. దీంతో మనసులు కలిశాయని చెప్పుకొచ్చాడు. కానీ లైవ్ ఇంకా ఖరారు చేయలేదు.