కొండారెడ్డి బురుజు దగ్గర #NBK107 టైటిల్ లాంచ్

కొండారెడ్డి బురుజును సినిమాల్లో ఎన్నోసార్లు చూశాం. ఇప్పుడు ఇక్కడ #NBK107 టైటిల్ ను లాంచ్ చేయబోతున్నారు. ఈ విషయాన్ని మేకర్స్‌ బుధవారం (అక్టోబర్‌ 19) అనౌన్స్‌ చేయగా.. అక్టోబర్‌ 21న ఈ టైటిల్‌ లాంచ్‌ జరగనుంది. శుక్రవారం (అక్టోబర్‌ 21) రాత్రి 8.15 గంటలకు ఈ టైటిల్‌ లాంచ్‌కు ముహూర్తం పెట్టారు.

మైత్రీ మూవీ మేకర్స్‌ భారీ స్థాయిలో నిర్మిస్తున్న ఈ సినిమాలో బాలకృష్ణ సరసన శృతి హాసన్‌ నటిస్తోంది. ఇక దునియా విజయ్‌, వరలక్ష్మి శరత్‌కుమార్‌ ముఖ్యమైన పాత్రల్లో కనిపించనున్నారు. తమన్‌ మ్యూజిక్ అందిస్తుఅన్నాడు. నవీన్‌ ఎర్నేని, వై రవిశంకర్‌ ఈ సినిమాను నిర్మిస్తున్నారు. సాయి మాధవ్‌ బుర్రా మాటలు అందించాడు.