పదేళ్ల కెరీర్.. అలియా ప్రామిస్ !

హీరోయిన్ గా అలియా భట్ కు పదేళ్లు నిండాయి. హీరోయిన్‌గా ఆమె నటించిన తొలి చిత్రం ‘స్టూడెంట్‌ ఆఫ్‌ ది ఇయర్‌’ విడుదలై నేటికి పదేళ్లు. ఈ సందర్భంగా అలియా ఆనందం వ్యక్తం చేసింది. అభిమానులకు  ఓ ప్రామిస్‌ కూడా చేసింది. ఇప్పటి వరకు నటించిన దానికంటే మెరుగ్గా నటిస్తా, మిమ్మల్ని అలరించేందుకు బాగా కష్టపడతానని వాగ్దానం చేసింది.

అలియా ‘సంఘర్ష్‌’ అనే చిత్రంతో బాల నటిగా తెరంగేట్రం చేశారు. ‘స్టూడెంట్‌ ఆఫ్‌ ది ఇయర్‌’ (Student of The Year)తో కథానాయికగా కెరీర్‌ ప్రారంభించారు. సిద్ధార్థ్‌ మల్హోత్ర, వరుణ్‌ ధావన్‌ హీరోలుగా కరణ్‌జోహార్‌ తెరకెక్కించిన ఆ చిత్రం 2012 అక్టోబరు 19న విడుదలైంది. తొలి సినిమాతోనే అలియా అందరి దృష్టిని ఆకర్షించారు.