అప్పుడే రాజమౌళి గురించి అర్థమైంది

మగధీర’ చూసినప్పుడే రాజమౌళి గురించి అర్థమైందన్నారు మ్యూజిక్ లెజెండ్ ఏఆర్‌ రెహమాన్‌. ఓ మీడియా సంస్థకు ఇచ్చిన ఇంటర్వ్యూలో జక్కన్న గురించి మాట్లాడారు.

“మగధీర సినిమా చూసినప్పుడు రాజమౌళి ఏదైనా సాధించగలరని నాకు అర్థమైంది. ఆ తర్వాత బాహుబలి సినిమా చూసి ఆశ్చర్యపోయాను. రాజమౌళి సినిమాలు తెలుగు సినిమా కీర్తిని పెంచేవిధంగా ఉంటాయి’’ అని అన్నారు. ఇక రోజా, బొంబాయి, దిల్‌ సే.. ఇవ్వన్నీ పాన్ ఇండియా సినిమాలేనని చెప్పారు.