ఆర్జీవి.. మళ్లీ రాజకీయాలు
సంచలన దర్శకుడు రామ్ గోపాల్ వర్మకు రాజకీయాలతో ఏమి సంబంధం లేదు. కానీ ఆయన పాలిటిక్స్ ను ప్రభావితం చేయగలడు. సింగిల్ ట్విట్ తో ఓ పొలిటికల్ పార్టీకి ప్లస్ చేయగలడు. మైనస్ చేయగలడు. అంతేకాదు.. బయోపిక్ ల పేరుతో పేరు మోసిన రాజకీయ పార్టీలను వణించగలడు. గత ఏపీ అసెంబ్లీ ఎన్నికలకు ముందు ఎన్ టీఆర్ బయోపిక్ తీసుకొచ్చిన వర్మ.. పరోక్షంగా వైసీపీకి లాభం చేకూర్చాడని చెప్పవచ్చు.
తాజాగా ఆర్జీవీ సీఎం జగన్ ను కలిశారు. దీంతో రాజకీయ నేపథ్యంలో మరో సినిమా తీయబోతున్నారు. ఈ సినిమాపై చర్చించేందుకు ఆయన ఏపీ ముఖ్యమంత్రి జగన్తో సమావేశమయ్యారనే ప్రచారం జరుగుతుంది. అయితే, రామ్గోపాల్ వర్మ మీడియాకు కనిపించకుండా సీఎంను కలిసి వెళ్లారు. దీనిపై సీఎం కార్యాలయం ఇప్పటి వరకు ఎలాంటి ప్రకటన చేయలేదు. ఏడాదిన్నరలో సాధారణ ఎన్నికలు ఉండటంతో వర్మ తీయబోయే కొత్త సినిమా రాజకీయాలపై ఎలాంటి ప్రభావం చూపుతుందోనన్న ఆసక్తి నెలకొంది.