ఎమ్మెల్యేల కొనుగోలు.. టీఆర్ఎస్ సెల్ఫ్ గోల్ ?

తెలంగాణలో టీఆర్ఎస్ ఎమ్మెల్యేల కొనుగోలు వ్యవహారం ప్రకంపనలు సృష్టిస్తుంది. బీజేపీనే ఈ పని చేసింది. ఇందుకోసం ఢిల్లీ నుంచి మనుషులు పంపింది. ఒక్కో టీఆర్ ఎస్ ఎమ్మెల్యేకు రూ. 100 కోట్ల ప్యాకేజీతో పాటు కాంట్రాక్టులు ఇస్తామని మభ్యపెట్టిందని టీఆర్ ఎస్ ఆరోపిస్తోంది. అంతేకాదు.. పట్టుబడిన వ్యక్తులు బీజేపీ ముఖ్యనేతలతో సన్నిహితంగా మెలిగిన ఫోటోలు, వీడియోలను సోషల్ మీడియాలో వైరల్ చేస్తున్నారు. ముఖ్యంగా కేంద్ర మంత్రి కిషన్ రెడ్డితో నిందితులు దిగిన ఫోటోలు వైరల్ గా మారాయి.

మరోవైపు తాజాగా పట్టుబడిన వారితో టీఆర్ ఎస్ నేతలకు, ముఖ్యంగా ప్రస్తుతం సీన్ లో ఉన్న నలుగురు ఎమ్మెల్యేలతో సన్నిహిత సంబంధాలు ఉన్నట్టు ఆధారాలు లభ్యం అయ్యారు. దీనికి సంబంధించిన ఫోటోలు, వీడియోలను కమలనాథులు వైరల్ చేస్తున్నారు. అంతేకాదు.. సంతోష్ రావుతో సన్నిహితంగా ఉన్న ఫోటోలు నెట్టింట్లో చక్కర్లు కొడుతుంది. దీంతో.. ఎమ్మెల్యేల కొనుగోలు వ్యవహారంలో కారు పార్టీ సెల్ఫ్ గోల్ చేసుకున్నట్టు కనబడుతుంది.