కాంతార.. సూపర్ స్టార్ ఫిదా !

కన్నడ చిత్రం ‘కాంతార’ పై ప్రశంసల జల్లు కురుస్తోంది. సాధారణ ప్రేక్షకుల నుంచి సినీ లెజెండ్స్ ఫిదా అవుతున్నారు.  తాజాగా ఈ సినిమాని చూసిన రజనీకాంత్‌  ప్రశంసలు కురిపించారు.

“తెలిసింది తక్కువ..తెలియనిది ఎక్కువ…ఈ విషయాన్ని సినిమాల్లో మీకంటే బాగా ఎవరూ చెప్పలేరు’అని ‘కాంతార’ చిత్ర నిర్మాణ సంస్థ హోంబలే ఫిల్మ్స్‌ను ఆయన కొనియాడారు. ‘‘కాంతార సినిమా రోమాలు నిక్కబొడుచుకునేలా చేసింది. ఇండియన్‌ సినిమాలోనే ఇదొక మాస్టర్‌ పీస్‌. రచయిత, దర్శకుడు, నటుడు రిషబ్‌శెట్టి ప్రతిభకు హ్యాట్సాఫ్‌’’ అని రజనీ ట్వీట్‌ చేశారు.