రూ. 100 కోట్లు, కాంట్రాక్టులు ఆఫర్‌ ?

నలుగురు టీఆర్ఎస్ ఎమ్మెల్యేలను కొనుగోలు చేసేందుకు బీజేపీ ప్రయత్నాలు చేసింది. ఇందుకోసం ఢిల్లీ నుంచి వ్యక్తులను పంపించింది. అచ్చంపేట ఎమ్మెల్యే గువ్వల బాలరాజుతో పాటు, కొల్లాపూర్‌ ఎమ్మెల్యే బీరం హర్షవర్ధన్‌రెడ్డి, పినపాక ఎమ్మెల్యే రేగ కాంతారావు తాండూరు ఎమ్మెల్యే పైలెట్‌ రోహిత్‌రెడ్డిని పార్టీ ఫిరాయింపులకు ప్రోత్సహించేందుకు ప్రయత్నించారు. అయితే టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు ఇచ్చిన ముందస్తు సమాచారంతో.. వారిని రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నామని పోలీసులు చెబుతున్నారు. ఈ నేపథ్యంలో టీఆర్ ఎస్, బీజేపీ నేతల మధ్య మాటల యుద్ధం షురూ అయింది.

ఈ నేపథ్యంలో మీడియాతో మాట్లాడిన టీఆర్ఎస్ ఎమ్మెల్యే బాల్కసుమన్‌ సంచలన ఆరోపణలు చేశారు.  ఒక్కో టీఆర్ఎస్ ఎమ్మెల్యేకు రూ.100 కోట్లు, కాంట్రాక్టులు ఆఫర్‌ చేశారు. నలుగురు ఎమ్మెల్యేలను కొనాలని బీజేపీ నేతలు ప్రయత్నించడంతో మా ఎమ్మెల్యేలే పోలీసులకు సమాచారం ఇచ్చారు. తెలంగాణ సమాజం అమ్ముడు పోయేది కాదని భాజపా గ్రహించాలి. కర్ణాటక, మహారాష్ట్ర, దిల్లీలో భాజపా అనేక కుట్రలు చేసిందని సుమన్ ఆరోపించారు.