ఘనంగా నాని కొడుకు పెళ్లి

నేచురల్ స్టార్ నాని కొడుకు పెళ్లి ఘనంగా జరిగింది. జెర్సీ సినిమాలో నాని కొడుకు పాత్రలో కోలీవుడ్‌ యువ నటుడు హరీశ్‌ కల్యాణ్‌ ఒదిగిపోయిన సంగతి తెలిసిందే. తాజాగా ఈ యువ హీరో వివాహబంధంలోకి అడుగుపెట్టాడు. నర్మదా ఉదయ్‌కుమార్‌ మెడలో మూడు ముళ్లు వేశాడు. వీరి వివాహం శుక్రవారం తెల్లవారుజామున చెన్నైలో వేడుకగా జరిగింది. హరీశ్‌ స్నేహితురాలు, నటి బిందుమాధవి ఈ వివాహ వేడుకలో పాల్గొని సందడి చేసింది.

యాక్షన్‌, యూత్‌ఫుల్‌ లవ్‌ ఎంటర్‌టైన్‌మెంట్‌ చిత్రాలతో కోలీవుడ్‌ ప్రేక్షకుల్ని అలరించిన హరీశ్‌ కల్యాణ్‌.. ‘ప్యార్‌ ప్రేమ కాదల్‌’, ‘ఇస్పడే రాజవుం ఇధయ రాణియుం’లతో గుర్తింపు తెచ్చుకున్నాడు. ‘కాదలి’ అనే టాలీవుడ్‌ చిత్రంలోనూ  హీరోగా నటించాడు. జెర్సీ’ సినిమాతో హరీశ్‌ కల్యాణ్ తెలుగువారికీ చేరువయ్యాడు. క్రికెట్‌ నేపథ్యంలో తెరకెక్కిన ఈ సినిమాలో నాని కుమారుడు పాత్రలో క్లైమాక్స్‌ సన్నివేశాల్లో తళుక్కున మెరిశాడు.