కేఎల్ రాహుల్ మరోసారి చెవులు మూసుకోవాల్సిందే !

టీ20 వరల్డ్ కప్ కు ముందు విరాట్ కోహ్లీ ఫామ్ పై అందరిలో ఆందోళన ఉండేది. కానీ కింగ్ కోహ్లీ గాడిపపడ్డారు. మెగా టోర్నీలో అదరగొడుతున్నారు. ఇక కెప్టెన్ రోహిత్ శర్మ నెదర్లాండ్స్ మ్యాచ్ తో టచ్ లోకి వచ్చినట్టు కనిపించింది. సూర్యకుమార్ యాదవ్, హార్ధిక్ పాండ్యా సూపర్ టచ్ లో కనిపిస్తున్నారు. ఇక మిగిలింది.. ఓపెనర్ కేఎల్ రాహుల్ మాత్రమే. ఇప్పటి వరకు ఆడిన రెండు మ్యాచ్ లలో రాహుల్ విఫలయ్యాడు. దీంతో అతడిని నెటిజన్స్ టార్గెట్ చేస్తున్నారు. విపరీతంగా ట్రోల్ చేస్తున్నారు. ఈ నేపథ్యంలో కేఎల్ మరోసారి చెవులు మూసుకోవాల్సిందేనని ఆయన అభిమానులు కోరుతున్నారు.

సక్సెస్ సాధించినప్పుడు ఒక్కో ఆటగాడు ఒక్కో విధంగా సెలబ్రేట్ చేసుకుంటాడు. కేఎల్ రాహుల్ అయితే.. బ్యాట్ కింద పడేసి.. రెండు చెవులు మూసుకుంటాడు. ఇప్పుడు మరోసారి అదే కావాలని కోరుతున్నారు ఆయన అభిమానులు. గ్రౌండ్ లో హాఫ్ సెంచరీ లేదా సెంచరీ బాది.. విమర్శలకు గట్టి సమాధానం చెప్పాలని సూచిస్తున్నారు. వాస్తవానికి పాకిస్తాన్ తో జరిగిన మ్యాచ్ లో కేఎల్ విఫలమయ్యాడు. అయితే నెదర్లాండ్స్ తో మ్యాచ్ లో రాహుల్ ఎల్బీ .. రిప్లేలో నాటౌట్ గా తేలింది. అవతలి ఎండ్ లో ఉన్న కెప్టెన్ రోహిత్ రివ్యూ తీసుకోమని చెబితే.. కేఎల్ నాటౌట్ గా బయటపడేవాడు. ఈ నేపథ్యంలో.. ఆ మ్యాచ్ లో కేఎల్ అవుట్ రోహిత్ ఖాతాలో వేయాలని అభిమానులు అంటున్నారు.