ఓటీటీలోకి ‘పొన్నియిన్‌ సెల్వన్‌’.. చూసేయండీ !

చోళుల సామ్రాజ్య వైభవం, చోళ రాజులు ఎదుర్కొన్న ఇబ్బందుల నేపథ్యంలో దర్శకుడు మణిరత్నం తీసుకొచ్చిన చిత్రం ‘పొన్నియిన్‌ సెల్వన్‌’. పాన్‌ ఇండియా స్థాయిలో విడుదలైన ఈ సినిమా తాజాగా ఓటీటీలోకి అందుబాటులోకి వచ్చింది. 

అమెజాన్‌ ప్రైమ్‌లో ఇది విడుదలైంది. అయితే.. ప్రస్తుతం ఈ సినిమా అద్దెకు మాత్రమే అందుబాటులో ఉంది. ఇక, నవంబర్‌ 4 నుంచి  ప్రైమ్‌ సబ్‌స్క్రైబర్లు అందరూ ఈ సినిమాను చూడొచ్చని ఓటీటీ ఫ్లాట్‌ఫామ్‌ పేర్కొంది.